BREAKING
అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే చర్యలు.. ఆక్రమిత భూముల రిజిస్ట్రేషన్‌పై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి రూ.9,100 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.. మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన ప్రత్యేక అధికారి పి. ప్రశాంతి ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి రాష్ట్ర స్థాయి సమీక్షా బృందం పర్యటన నగరం మండలంలో 71.55 శాతం ఓటింగ్ ఐరోపాలో విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు పెళ్లి పీటలెక్కేముందు..ఓటు వేసిన పెళ్లికూతురు! ఎయిమ్స్ అవంతిపొరా పనులపై జేపీ నడ్డా సమీక్ష నిమ్మాడలో ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి అదానీ పోర్ట్స్ భారీ గ్లోబల్ డీల్: ఎవోస్ కొనుగోలు ట్రంప్ మీడియా షేరు భారీ పతనం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన కార్పొరేటర్ ఒమ్మి క్యూ2 ఫలితాలు: టైటాన్ దూకుడు, హోండాకు నష్టం

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన ప్రత్యేక అధికారి పి. ప్రశాంతి

Select Suryaa Now
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన ప్రత్యేక అధికారి పి. ప్రశాంతి

రావులపాలెం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల ప్రత్యేక అధికారి పి. ప్రశాంతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గురువారం ఆలమూరు, రావులపాలెం మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల నిర్వహణ తీరును సమీక్షించారు.

రావులపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ సరళి, ఓటర్ల రాకపోకలు, ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణ, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. పోలింగ్‌లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేసేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తయ్యేలా ఎన్నికల, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఆమె వెంట హార్టికల్చర్ జేడీ బి. రమణ, ఆలమూరు, రావులపాలెం తహసీల్దార్లు, ఎంపీడీవోలు రాజు, వరసుబ్రహ్మణ్యం తదితర అధికారులు పాల్గొన్నారు.