BREAKING
ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ హిమాన్షు శుక్ల ఖేడ్ సమస్యలపై మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు *పేదవాడి సొంతింటి కల సహకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ ఛైర్మన్ దారం శంకర్* ప్రజా సమస్యలపై గళం విన్పిస్తా - కౌన్సిలర్ స్వప్న ఒకే దెబ్బకు రెండు ప్రపంచ రికార్డులు.. సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ లిథియం, నికెల్ ప్రాసెసింగ్‌కు రూ. 2,814 కోట్లు కావేరి హాస్పిటల్ ఆధ్వర్యంలో ‘సమత్వ’ ఆవిష్కరణ పెద్దపంజాణి మండలంలో 45,284 మంది ఓటర్లు - పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం ఆత్మకూరులో క్రికెట్ టోర్నమెంట్స్ క్రికెట్ చరిత్రలో సంచలనం.. తొలి ఆరు ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగుల వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన బ్యాటర్ బ్రిటన్ సుప్రీంకోర్టులో 'పాలస్తీనా యాక్షన్' నిషేధంపై విచారణ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. డి.ఎస్.పి దైవప్రసాద్. ఉత్తరాఖండ్ ట్రెక్కింగ్ ప్రమాదం: ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి పోలింగ్‌కు ఆటంకం కలిగిస్తే క్రిమినల్ కేసులు ఇటలీ పౌరుల వైద్య ఖర్చులను మాఫీ చేసిన స్విట్జర్లాండ్

ఎన్టీఆర్ జిల్లాలో కూటమి విజయదుందుభి.. ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో సంబరాలు

Select Suryaa Now
ఎన్టీఆర్ జిల్లాలో కూటమి విజయదుందుభి.. ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో సంబరాలు

విజయవాడ, మేజర్ న్యూస్: ఎన్టీఆర్ జిల్లాలోని మున్సిపాలిటీలు, విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో విజయవాడలో రాజకీయ సందడి నెలకొంది. విజయం సాధించిన అభ్యర్థులు, వారి అనుచరులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయానికి తరలివచ్చారు. దీంతో కార్యాలయ ప్రాంగణం విజయోత్సాహంతో కళకళలాడింది.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని విజయం సాధించిన అభ్యర్థులను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలను కూడా ఎంపీ అభినందించారు. నాయకుల సమన్వయం, కార్యకర్తల సమష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రజలు అందించిన విజయాన్ని బాధ్యతగా స్వీకరించి స్థానిక సంస్థలను అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.



స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.