BREAKING
హోర్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లపై దాడులతో ఇరాన్ వ్యూహాత్మక ఒత్తిడి వైసీపీ చేజారుతుందా? కూటమికి పైచేయి దక్కుతుందా? విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్యే మసీద్ హుస్సేన్ ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య జర్మనీ నూతన రక్షణ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ క్రిస్టియన్ ఫ్రూడింగ్ నియామకం ఘనంగా కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు యూరోపియన్ అల్యూమినియం కొనుగోలుదారులపై పడుతున్న ప్రతికూల భారం *ఖేడ్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కర్* పదవీ విరమణ చేసిన హోంగార్డులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెక్కులు అందజేసిన జిల్లా ఎస్పీ వేదమంత్రోచ్ఛారణలు.. అయ్యప్ప స్వాముల భజనలతో మార్మోగిన నవరత్నాలయం ఓటరు స్లిప్పుల పంపిణీలో లోపాలా..? తుఫాను ప్రభావమా..? 108 ఏళ్ల వయసులోనూ ఓటు పట్ల అదే తపన..! వలీమా వేడుకల్లో పాల్గొన్నా మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్ ప్రశాంతంగా ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 71.35 శాతం పోలింగ్ అమెరికాలో డేటా సెంటర్ల వ్యతిరేకత ప్రభావం

ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ హిమాన్షు శుక్ల

Select Suryaa Now
ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ హిమాన్షు శుక్ల

వెంకటాచలం ,మేజర్ న్యూస్  :     జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. వెంకటాచలంలోని రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించి ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 34 మండలాల పరిధిలో 1,568 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల విధుల్లో 11 వేల మంది సిబ్బందిని, భద్రత కోసం 3 వేల మంది పోలీసులను నియమించినట్లు పేర్కొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపునిచ్చారు.