మురుగు సమస్యను తక్షణమే పరిష్కరించిన కార్పొరేటర్
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. మురసు తుఫాన్ నేపథ్యంలో కురిసిన వర్షం కారణంగా గురువారం నగరం లోని 37వ డివిజన్ రెడ్ క్రాస్ స్ట్రీట్ ఎక్స్టెన్షన్ లోని విగ్నేశ్వర్ నగర్ వీధి మురుగు నీటితో నిండిపోయింది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మురుగు నీరు చేరడంతో స్థానికులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. సమస్యను గమనించిన 37వ డివిజన్ కార్పొరేటర్ అనసూయ సానిటరీ సిబ్బందిని రప్పించి రోడ్డులో నిలిచిపోయిన మురుగు నీటి సమస్యను సత్వరమే పరిష్కరించారు. మరల ఇటువంటి సమస్య పునరావృతం కాకుండా మునిసిపల్ ఉన్నతస్థాయి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.