BREAKING
ప్రశాంతంగా ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 71.35 శాతం పోలింగ్ అమెరికాలో డేటా సెంటర్ల వ్యతిరేకత ప్రభావం మురుగు సమస్యను తక్షణమే పరిష్కరించిన కార్పొరేటర్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి మండల పోలింగ్‌లో శివల టాప్‌ చిట్టమూరులో ప్రశాంతంగా పోలింగ్..77.77 శాతం ఓటింగ్ నమోదు 7 బిలియన్ డాలర్ల సమీకరణే లక్ష్యంగా యాపిల్ బాండ్ జారీ జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన బీజేపీ నేతలు. అధికారుల సమక్షంలో అభివృద్ధి పనులపై సమీక్ష కాంగోలో చైనా రాగి గని కాలుష్యంపై తిరగబడిన స్థానికులు క్రీడా టోర్నమెంట్ల నిర్వహణ నుంచి పేద కుటుంబాలకు ఆర్థిక సాయం వరకు భక్తిశ్రద్ధలతో శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారి పునఃప్రతిష్ఠ మహోత్సవం మచ్చలేని మహనీయుడు మంత్రి దామోదర్ రాజనర్సింహ మేధావి రాష్ట్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర కే గర్వకారణం కావాలని దుష్ప్రచారం వెంటనే ఆపాలి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య మెథడిస్ట్ క్రిస్టియన్ జాతర వాహనాల పార్కింగ్ హక్కులకు నవంబర్ 7న బహిరంగ వేలం రికార్డు స్థాయికి అభివృద్ధి చెందుతున్న దేశాల విదేశీ రుణాలు

క్రీడా టోర్నమెంట్ల నిర్వహణ నుంచి పేద కుటుంబాలకు ఆర్థిక సాయం వరకు

Select Suryaa Now
క్రీడా టోర్నమెంట్ల నిర్వహణ నుంచి పేద కుటుంబాలకు ఆర్థిక సాయం వరకు

కొండాపూర్;సామాజిక సేవే లక్ష్యంగా.. పేదలకు అండగా నిలుస్తూ.. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎం.ఎ. ముఖిమ్  తన సేవా కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగిస్తున్నారు. కొంతకాలంగా సొంత నిధులతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.మండల పరిధిలోని కొనాపూర్ క్రికెట్ స్టేడియంలో ఇటీవల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. యువత క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో  ఎక్కడ క్రీడా పోటీలు నిర్వహించినా నిర్వాహకులకు అండగా నిలుస్తున్నారు. టోర్నమెంట్ల నిర్వహణకు అయ్యే ఖర్చులను తన సొంత నిధులతో భరిస్తూ యువతను ప్రోత్సహిస్తున్నారు.ఆపదలో ఉన్నవారికి ఆర్థిక భరోసా క్రీడా కార్యక్రమాలకే పరిమితం కాకుండా పేదలు, నిరుపేద కుటుంబాలకు తన వంతు సహాయం అందిస్తున్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు ధైర్యం కల్పిస్తున్నారు. నిరుపేద కుటుంబాల్లో ఎవరైనా మృతి చెందితే బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థికంగా ఆదుకుంటున్నారు.తన ఫౌండేషన్ ద్వారా పేదలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ముఖిమ్ తెలిపారు. ప్రజలకు అండగా నిలవాలనే సంకల్పంతో సేవా కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.సేవా భావమే ఆదర్శం సొంత నిధులతో ప్రజలకు సేవ చేస్తూ, యువతకు ప్రోత్సాహం అందిస్తూ, ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న ముఖిమ్ వంటి సేవాభావం కలిగిన వ్యక్తులు ప్రజాజీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగితే సమాజానికి మరింత సేవ చేసే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతున్న ఆయన కృషి ఆదర్శంగా నిలుస్తోంది.