అధికారులు సమన్వయతో పనిచేసి గ్రామాలలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని
రాయికోడ్;మండల కేంద్రమైన రాయికోడ్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో మసుద్ షరీఫ్ మరియు మండల స్పెషల్ అధికారి జగదీష్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం గురువారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు వివిధ గ్రామాలలో విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, అంగన్‌వాడీ భవనాలు, రేషన్ సమస్యలను అధికారుల దృష్టికి తెలియజేశారు చిమ్నాపూర్ గ్రామంలో హైస్కూల్ ఏర్పాటు చేయాలని ఎంఈఓ నరసింహులు గారికి ప్రతిపాదించారు. పంటల నమోదు గడువు పెంచాలని వ్యవసాయ అధికారి సారిక కోరారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య మాట్లాడుతూ రాయికోడ్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడం సంతోషకరమని, వివిధ గ్రామాల్లో రోడ్ల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. మండల ప్రత్యేక అధికారి జగదీష్ మాట్లాడుతూ తాగునీరు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధికారులు, సర్పంచులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈయొక్క తహసీల్దార్ అనుమతి లేకుండా బోర్లు వేయరాదని స్పష్టం చేశారు.ఈయొక్క కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య, మండల స్పెషల్ అధికారి జగదీష్, ఎంపీడీవో, మసూద్ షరీఫ్, ఏవో సారిక, తహసిల్దార్ ఆశ జ్యోతి,వివిధ గ్రామాల సర్పంచులు సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు