BREAKING
దేశీయంగా ప్రీమియం వైన్‌లకు పెరుగుతున్న డిమాండ్ అధికారులు సమన్వయతో పనిచేసి గ్రామాలలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ ఎస్ రాయికోడ్‌లో ఘనంగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం ఉక్రెయిన్‌కు అదనంగా 100 మిలియన్ యూరోల మౌలిక వసతుల సహాయాన్ని ప్రకటించిన జర్మనీ *నీలం మధు ముదిరాజ్‌కు అవకాశం కల్పించాలి: తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి జహీరాబాద్ ఇంచార్జి రవి ముదిరాజ్ ఎన్ ఎమ్ ఆర్* కుటుంబ సమేతంగా ఓటు వేసిన వైసీపీ నేత వరికూటి అశోక్ బాబు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి - దేవునిపల్లె లో న్యాయ విజ్ఞాన సదస్సు వరద ఉధృతిలో చిక్కుకున్న ముగ్గురు మహిళలకు పోలీసుల రక్షణ! నడుముకు తాడు కట్టుకుని వరదలోకి దూకిన సీఐ సుబ్బనాయుడు సాహసోపేతంగా మహిళలను కాపాడిన పోలీసు సిబ్బంది.. హోంమంత్రి అనిత ప్రశంసలు తోషిబా కార్మిక సంఘం ఎన్నికల్లో చంద్రశేఖర్‌ను గెలిపించండి అక్రమంగా టపాసులు నిల్వ చేసినా.. విక్రయించినా కఠిన చర్యలు -పటాన్‌చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభం భట్టిప్రోలు మండలంలో 68.35 శాతం పోలింగ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 354 వైద్య శిబిరాలు నిర్వహణ బ్రాహ్మణపల్లి పోలింగ్ స్టేషన్ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సంజన శ్రీహర్ష ఎమ్మెల్యే సంజీవ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిని కలిసిన శాపురం నర్సింహా రెడ్డి

కుటుంబ సమేతంగా ఓటు వేసిన వైసీపీ నేత వరికూటి అశోక్ బాబు

Select Suryaa Now
కుటుంబ సమేతంగా ఓటు వేసిన వైసీపీ నేత వరికూటి అశోక్ బాబు

వేమూరు (భట్టిప్రోలు), మేజర్ న్యూస్: వేమూరు నియోజకవర్గంలో గురువారం జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు తన ఓటు హక్కును కుటుంబ సమేతంగా వినియోగించుకున్నారు. కూచిపూడి గ్రామంలోని పీఎస్ నెంబర్ 89 పోలింగ్ కేంద్రానికి ఉదయమే చేరుకున్న అశోక్ బాబు, తన కుటుంబ సభ్యులతో కలిసి క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు. ఆయన వెంట భార్య వరికూటి లక్ష్మీ, కుమారుడు యువ నాయకులు వరికూటి గౌతమ్, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఓటు వేసిన అనంతరం పోలింగ్ కేంద్రం ముందు వేలిపై చెరగని సిరా గుర్తును చూపిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోకు ఫోజిచ్చారు.ఈ సందర్భంగా వరికూటి అశోక్ బాబు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలన్నారు. ఓటు అనేది కేవలం మన హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా అని ఆయన అన్నారు. తమ కుటుంబం అంతా కలిసి ఓటు వేయడం చాలా సంతోషంగా ఉందని, ఇది తమ పిల్లలకు కూడా మంచి సందేశం ఇస్తుందన్నారు.మీ ఓటు - మీ భవిష్యత్తు, మీ ఓటు - మీ పిల్లల భవిష్యత్తు అని గుర్తుచేసిన ఆయన, ఇంకా ఓటు వేయని ఓటర్లు వెంటనే తమ సమీప పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేయడం ద్వారానే మన గ్రామ అభివృద్ధిని, మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకుంటామని ఆయన పేర్కొన్నారు.పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేస్తున్న తీరును ఆయన పరిశీలించి, ఎన్నికల సిబ్బంది, పోలీసుల ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.