ఎమ్మెల్యే సంజీవ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిని కలిసిన శాపురం నర్సింహా రెడ్డి
పటాన్‌చెరు;ముత్తంగి డివిజన్ కాంగ్రెస్ నాయకులు శాపురం నర్సింహా రెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవ రెడ్డి, సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు పటోళ్ల చంద్రశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నూతనంగా డీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పటోళ్ల చంద్రశేఖర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇరువురు నాయకులతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశాలపై చర్చించారు.ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలు,పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ వివరించేలా నాయకులు,కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంతో పాటు ప్రజా సమస్యలను నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని చర్చించారు.పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ప్రజలకు మరింత చేరువయ్యేలా కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.