BREAKING
దేశీయంగా ప్రీమియం వైన్‌లకు పెరుగుతున్న డిమాండ్ అధికారులు సమన్వయతో పనిచేసి గ్రామాలలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ ఎస్ రాయికోడ్‌లో ఘనంగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం ఉక్రెయిన్‌కు అదనంగా 100 మిలియన్ యూరోల మౌలిక వసతుల సహాయాన్ని ప్రకటించిన జర్మనీ *నీలం మధు ముదిరాజ్‌కు అవకాశం కల్పించాలి: తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి జహీరాబాద్ ఇంచార్జి రవి ముదిరాజ్ ఎన్ ఎమ్ ఆర్* కుటుంబ సమేతంగా ఓటు వేసిన వైసీపీ నేత వరికూటి అశోక్ బాబు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి - దేవునిపల్లె లో న్యాయ విజ్ఞాన సదస్సు వరద ఉధృతిలో చిక్కుకున్న ముగ్గురు మహిళలకు పోలీసుల రక్షణ! నడుముకు తాడు కట్టుకుని వరదలోకి దూకిన సీఐ సుబ్బనాయుడు సాహసోపేతంగా మహిళలను కాపాడిన పోలీసు సిబ్బంది.. హోంమంత్రి అనిత ప్రశంసలు తోషిబా కార్మిక సంఘం ఎన్నికల్లో చంద్రశేఖర్‌ను గెలిపించండి అక్రమంగా టపాసులు నిల్వ చేసినా.. విక్రయించినా కఠిన చర్యలు -పటాన్‌చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభం భట్టిప్రోలు మండలంలో 68.35 శాతం పోలింగ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 354 వైద్య శిబిరాలు నిర్వహణ బ్రాహ్మణపల్లి పోలింగ్ స్టేషన్ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సంజన శ్రీహర్ష ఎమ్మెల్యే సంజీవ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిని కలిసిన శాపురం నర్సింహా రెడ్డి

అక్రమంగా టపాసులు నిల్వ చేసినా.. విక్రయించినా కఠిన చర్యలు

Select Suryaa Now
అక్రమంగా టపాసులు నిల్వ చేసినా.. విక్రయించినా కఠిన చర్యలు
పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి 
నరసరావుపేట, న్యూస్ : జిల్లా లో అనుమతులు లేకుండా అక్రమంగా టపాసులు నిల్వ చేసినా, విక్రయించినా ఉపేక్షించేది లేదని పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పేలుడు పదార్థాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీపావళి నేపథ్యంలో బాణసంచా విక్రయదారులు, ప్రజలు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. బాణసంచా విక్రయించాలంటే తప్పనిసరిగా అధికారిక లైసెన్స్ కలిగి ఉండాలని ఎస్పీ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన బహిరంగ ప్రదేశాల్లోనే, నిర్ణీత ప్రమాణాల ప్రకారం ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేసుకోవా లని సూచించారు. ప్రతి దుకాణంలో నీరు, ఇసుకతో పాటు అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణకు ప్రజలకు అవగాహన కల్పించే సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని, విక్రయ కేంద్రాల్లో బాలకార్మికులను పనిలో పెట్టుకోరాదని స్పష్టం చేశారు. అనుమతు లు లేకుండా బాణసంచా నిల్వ చేసినా తయారు చేసినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. నిబంధనల ఉల్లంఘన లను గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా అక్రమ బాణసంచా వ్యాపారంపై నిఘా కొనసాగు తుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ  దీపావళి పండుగను ప్రజలంతా సురక్షితంగా జరుపుకోవాలని ఎస్పీ కోరారు. జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా టపాసులు నిల్వ చేసినా, విక్రయిస్తున్నా వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు లేదా జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. బాణసంచా వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ జగదీష్ అదహళ్లి విజ్ఞప్తి చేశారు.