BREAKING
క్రీడా టోర్నమెంట్ల నిర్వహణ నుంచి పేద కుటుంబాలకు ఆర్థిక సాయం వరకు భక్తిశ్రద్ధలతో శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారి పునఃప్రతిష్ఠ మహోత్సవం మచ్చలేని మహనీయుడు మంత్రి దామోదర్ రాజనర్సింహ మేధావి రాష్ట్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర కే గర్వకారణం కావాలని దుష్ప్రచారం వెంటనే ఆపాలి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య మెథడిస్ట్ క్రిస్టియన్ జాతర వాహనాల పార్కింగ్ హక్కులకు నవంబర్ 7న బహిరంగ వేలం రికార్డు స్థాయికి అభివృద్ధి చెందుతున్న దేశాల విదేశీ రుణాలు దేశీయంగా ప్రీమియం వైన్‌లకు పెరుగుతున్న డిమాండ్ అధికారులు సమన్వయతో పనిచేసి గ్రామాలలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ ఎస్ రాయికోడ్‌లో ఘనంగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం ఉక్రెయిన్‌కు అదనంగా 100 మిలియన్ యూరోల మౌలిక వసతుల సహాయాన్ని ప్రకటించిన జర్మనీ *నీలం మధు ముదిరాజ్‌కు అవకాశం కల్పించాలి: తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి జహీరాబాద్ ఇంచార్జి రవి ముదిరాజ్ ఎన్ ఎమ్ ఆర్* కుటుంబ సమేతంగా ఓటు వేసిన వైసీపీ నేత వరికూటి అశోక్ బాబు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి - దేవునిపల్లె లో న్యాయ విజ్ఞాన సదస్సు వరద ఉధృతిలో చిక్కుకున్న ముగ్గురు మహిళలకు పోలీసుల రక్షణ! నడుముకు తాడు కట్టుకుని వరదలోకి దూకిన సీఐ సుబ్బనాయుడు సాహసోపేతంగా మహిళలను కాపాడిన పోలీసు సిబ్బంది.. హోంమంత్రి అనిత ప్రశంసలు తోషిబా కార్మిక సంఘం ఎన్నికల్లో చంద్రశేఖర్‌ను గెలిపించండి అక్రమంగా టపాసులు నిల్వ చేసినా.. విక్రయించినా కఠిన చర్యలు

ఎంపీపీ ఎస్ రాయికోడ్‌లో ఘనంగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం

Select Suryaa Now
ఎంపీపీ ఎస్ రాయికోడ్‌లో ఘనంగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం

రాయికోడ్;మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎంపీపీ ఎస్ పాఠశాల రాయికోడ్‌లోని  పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (PTM) నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల ఎల్.ఎఫ్.ఎల్. ప్రధానోపాధ్యాయులు బి. శ్రీనివాస్, ఎస్సీ హాస్టల్ వార్డెన్, వంశీకృష్ణ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన సమ్మేటివ్ అసెస్‌మెంట్–1 (SA-1) పరీక్షల ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు పంపిణీ చేశారు. విద్యార్థుల పరీక్షల ఫలితాలు, అభ్యసన సామర్థ్యాలు, విషయాల వారీగా సాధించిన ప్రగతిని తల్లిదండ్రులకు వివరించారు.విద్యార్థుల విద్యాభివృద్ధిలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో ముఖ్యమని సమావేశంలో వివరించారు. పిల్లలు ప్రతిరోజూ పాఠశాలకు హాజరయ్యేలా చూడటంతో పాటు, ఇంటి వద్ద చదువుకునే అలవాటును పెంపొందించాలని తల్లిదండ్రులకు సూచించారు.విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపరచడానికి పాఠశాల మరియు తల్లిదండ్రుల మధ్య సమన్వయం అవసరమని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపినప్పుడే మెరుగైన విద్యా ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు, విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి పనిచేయాలనే సందేశాన్ని అందించారు.