తోషిబా కార్మిక సంఘం ఎన్నికల్లో చంద్రశేఖర్‌ను గెలిపించండి
పటాన్‌చెరు;ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం తోషిబా పరిశ్రమ యూనిట్‌లో ఈ నెల 7న నిర్వహించనున్న కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ,బీఎంఎస్ బలపరిచిన అభ్యర్థి ఆర్.డి. చంద్రశేఖర్‌ను త్రాసు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.ఈ మేరకు నిర్వహించిన గేటు సమావేశంలో నాయకులు పాల్గొని చంద్రశేఖర్‌కు తమ మద్దతు ప్రకటించారు.ఈ సమావేశానికి బీఎంఎస్ జాతీయ అధ్యక్షుడు మల్లేష్, సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు, పరిశ్రమ ముఖ్య ఉపాధ్యక్షుడు కొల్కూరి నర్సింహారెడ్డి, ఐఎన్‌టీయూసీ బీహెచ్‌ఈఎల్ అధ్యక్షుడు రెహమాన్, ఎన్‌ఎఫ్‌సీ నాయకుడు విజయ్‌కుమార్ యాదవ్, ఓడీఎఫ్ నాయకుడు జనార్ధన్‌రెడ్డి, 327 విద్యుత్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ నాయకుడు ఆదిల్ షరీఫ్, మహేంద్ర, ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి శివకుమార్, వీఎస్‌టీ ప్రధాన కార్యదర్శి పాల్ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసే ఆర్.డి. చంద్రశేఖర్‌కు కార్మికులంతా అండగా నిలవాలని కోరారు. ఎన్నికల్లో త్రాసు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి వివిధ కార్మిక సంఘాల నాయకులతో పాటు భారీ సంఖ్యలో కార్మికులు హాజరయ్యారు.