BREAKING
దేశీయంగా ప్రీమియం వైన్‌లకు పెరుగుతున్న డిమాండ్ అధికారులు సమన్వయతో పనిచేసి గ్రామాలలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ ఎస్ రాయికోడ్‌లో ఘనంగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం ఉక్రెయిన్‌కు అదనంగా 100 మిలియన్ యూరోల మౌలిక వసతుల సహాయాన్ని ప్రకటించిన జర్మనీ *నీలం మధు ముదిరాజ్‌కు అవకాశం కల్పించాలి: తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి జహీరాబాద్ ఇంచార్జి రవి ముదిరాజ్ ఎన్ ఎమ్ ఆర్* కుటుంబ సమేతంగా ఓటు వేసిన వైసీపీ నేత వరికూటి అశోక్ బాబు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి - దేవునిపల్లె లో న్యాయ విజ్ఞాన సదస్సు వరద ఉధృతిలో చిక్కుకున్న ముగ్గురు మహిళలకు పోలీసుల రక్షణ! నడుముకు తాడు కట్టుకుని వరదలోకి దూకిన సీఐ సుబ్బనాయుడు సాహసోపేతంగా మహిళలను కాపాడిన పోలీసు సిబ్బంది.. హోంమంత్రి అనిత ప్రశంసలు తోషిబా కార్మిక సంఘం ఎన్నికల్లో చంద్రశేఖర్‌ను గెలిపించండి అక్రమంగా టపాసులు నిల్వ చేసినా.. విక్రయించినా కఠిన చర్యలు -పటాన్‌చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభం భట్టిప్రోలు మండలంలో 68.35 శాతం పోలింగ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 354 వైద్య శిబిరాలు నిర్వహణ బ్రాహ్మణపల్లి పోలింగ్ స్టేషన్ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సంజన శ్రీహర్ష ఎమ్మెల్యే సంజీవ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిని కలిసిన శాపురం నర్సింహా రెడ్డి

భట్టిప్రోలు మండలంలో 68.35 శాతం పోలింగ్

Select Suryaa Now
భట్టిప్రోలు మండలంలో 68.35 శాతం పోలింగ్

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: భట్టిప్రోలు మండల పరిధిలో గురువారం జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో మొత్తం 68.35 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారీ డాక్టర్ ఎన్ దేవలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఉన్న 52 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 42,122 మంది ఓటర్లు ఉండగా, అందులో 28,790 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు.
పోలింగ్ లో మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా పాల్గొన్నారు. మొత్తం 14,029 మంది పురుషులు, 14,761 మంది మహిళలు ఓటు వేశారు. మండలంలో అత్యధిక పోలింగ్ పల్లికోన సెగ్మెంట్ లో నమోదైందన్నారు. పల్లికోనలో 78.41 శాతం పోలింగ్ నమోదు కాగా, గొరిగపూడి సెగ్మెంట్ లో 73.52 శాతం, కొనేటిపురం సెగ్మెంట్ లో 73.21 శాతం, సూరేపల్లిలో 72.43 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్ప పోలింగ్ భట్టిప్రోలు-4 సెగ్మెంట్ లో 61.55 శాతంగా నమోదైంది. భట్టిప్రోలు మండలంలోని మిగిలిన సెగ్మెంట్లలో ఐలవరం 68.53 శాతం, పెసర్లంక 68.38 శాతం, పెదపులివర్రు 68.75 శాతం, భట్టిప్రోలు-1 లో 66.60 శాతం, భట్టిప్రోలు-3 లో 65.12 శాతం, భట్టిప్రోలు-2 లో 64.57 శాతం, వెల్లటూరు-1 లో 64.29 శాతం, వెల్లటూరు-2 లో 66.78 శాతం, ఓలేరులో 64.17 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మండలంలో ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని, ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.