BREAKING
దేశీయంగా ప్రీమియం వైన్‌లకు పెరుగుతున్న డిమాండ్ అధికారులు సమన్వయతో పనిచేసి గ్రామాలలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ ఎస్ రాయికోడ్‌లో ఘనంగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం ఉక్రెయిన్‌కు అదనంగా 100 మిలియన్ యూరోల మౌలిక వసతుల సహాయాన్ని ప్రకటించిన జర్మనీ *నీలం మధు ముదిరాజ్‌కు అవకాశం కల్పించాలి: తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి జహీరాబాద్ ఇంచార్జి రవి ముదిరాజ్ ఎన్ ఎమ్ ఆర్* కుటుంబ సమేతంగా ఓటు వేసిన వైసీపీ నేత వరికూటి అశోక్ బాబు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి - దేవునిపల్లె లో న్యాయ విజ్ఞాన సదస్సు వరద ఉధృతిలో చిక్కుకున్న ముగ్గురు మహిళలకు పోలీసుల రక్షణ! నడుముకు తాడు కట్టుకుని వరదలోకి దూకిన సీఐ సుబ్బనాయుడు సాహసోపేతంగా మహిళలను కాపాడిన పోలీసు సిబ్బంది.. హోంమంత్రి అనిత ప్రశంసలు తోషిబా కార్మిక సంఘం ఎన్నికల్లో చంద్రశేఖర్‌ను గెలిపించండి అక్రమంగా టపాసులు నిల్వ చేసినా.. విక్రయించినా కఠిన చర్యలు -పటాన్‌చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభం భట్టిప్రోలు మండలంలో 68.35 శాతం పోలింగ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 354 వైద్య శిబిరాలు నిర్వహణ బ్రాహ్మణపల్లి పోలింగ్ స్టేషన్ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సంజన శ్రీహర్ష ఎమ్మెల్యే సంజీవ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిని కలిసిన శాపురం నర్సింహా రెడ్డి

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 354 వైద్య శిబిరాలు నిర్వహణ

Select Suryaa Now
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 354 వైద్య శిబిరాలు నిర్వహణ
జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ 
గుంటూరు కలెక్టరేట్ న్యూస్: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 354 వైద్య శిబిరాలను గురువారం నిర్వహించామని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. గుంటూరు రూరల్ మండలం లాలు పురం గ్రామంలో పోలింగ్ ను పరిశీలించిన కలెక్టర్, అచ్చట ఏర్పాట్లు పట్ల, వైద్య శిబిరం పట్ల ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో 229, పట్టణ ప్రాంతాల్లో 125 వైద్య శిబిరాలు నిర్వహించి 2,508 మందికి వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. బుధవారం గ్రామీణ ప్రాంతాల్లో 221, పట్టణ ప్రాంతాల్లో 82 వైద్య శిబిరాలు వెరసి 303 శిబిరాలు నిర్వహించి 3,028 మందికి వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. 8 పునరావాస కేంద్రాల్లోను ఏర్పాటు చేసి సేవలు అందించడం జరిగిందన్నారు. గురువారం అప్పాపురం పునరావాస కేంద్రంలో వైద్య శిబిరాన్ని కొనసాగించామని చెప్పారు. తుఫాను అనంతరం వ్యాధులు ప్రభలుటకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ముందస్తు చర్యగా వైద్య శిబిరాలను నిర్వహించామని చెప్పారు. ఇప్పటికే తాగునీటి పథకాలను క్లోరినేషన్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని చెప్పారు. ప్రజలు కొద్ది రోజులపాటు పారిశుధ్య నిర్వహణ తాగునీటిపై జాగ్రత్తలు వహించాలని కోరారు. నీటిని బాగా మరగకాచి చల్లార్చి తాగాలని కోరారు. వైద్యులు వైద్య సిబ్బంది మంచి సేవలను అందించారని కొనియాడారు. 
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వైద్య శిబిరాలు…జిల్లాలో జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలు పోలింగ్ జరిగిన 724 కేంద్రాల్లోనూ గురువారం వైద్య శిబిరాలను నిర్వహించి సేవలు అందించామని చెప్పారు. బుధవారం అన్ని ఎన్నికల పంపిణీ కేంద్రాల్లో వైద్య శిబిరాలు నిర్వహించామని, ఏడవ తేదీన తెనాలి,  ఆచార్య నాగార్జునవిశ్వవిద్యాలయంలో జరిగే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనూ వైద్య శిబిరాలు కొనసాగిస్తామని తెలిపారు. పునరావాస కేంద్రాలలోనూ, గ్రామాల్లోను వైద్య శిబిరాలను నిర్వహించడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. వైద్య సేవలను ప్రజలకు చేరువు చేయడం జరిగిందని పేర్కొన్నారు.