చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి - దేవునిపల్లె లో న్యాయ విజ్ఞాన సదస్సు
సూర్య - పెద్దపల్లి రూరల్ 01: న్యాయంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి , సీనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ సూచించారు. పెద్దపల్లి మండలం దేవునిపల్లె గ్రామంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన హాజరై గ్రామస్థులకు పలు చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా
జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి , సీనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ మాట్లాడుతూ చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. చిన్నారుల భద్రత విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, లేకుంటే 112 కు కాల్ చేయాలని సూచించారు. చట్టాలు, హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొక్కల రేఖ సంతోష్, న్యాయవాదులు నరేష్, ఝాన్సీ గ్రామస్థులు పాల్గొన్నారు.