కృషి విజ్ఞాన్ కంపెనీలో ఈ నెల 10న జాబ్ మేళా..
సూర్య - పెద్దపల్లి : నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 10న పెద్దపల్లిలోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. రాజశేఖర్ తెలిపారు.
కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్స్ కంపెనీలో 60 సేల్స్ ఎగ్జిక్యూటివ్, 4 ఫీల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు కలిపి మొత్తం 64 ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్, డిగ్రీ లేదా డిప్లొమా, ఫీల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులకు బీఎస్సీ అగ్రికల్చర్ అర్హత ఉండాలని తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనంతో పాటు టీఏ, డీఏ, ఇన్సెంటివ్‌లు అందిస్తారని వెల్లడించారు.ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 10న ఉదయం 11 గంటలకు సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తు, గది నంబర్ 233లో జరిగే జాబ్ మేళాకు రెజ్యూమ్, విద్యార్హతల ధ్రువపత్రాలు, ఆధార్ జిరాక్స్‌తో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 8985336947, 8121262441 నంబర్లను సంప్రదించాలని కోరారు.