BREAKING
బ్రాహ్మణపల్లి పోలింగ్ స్టేషన్ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సంజన శ్రీహర్ష ఎమ్మెల్యే సంజీవ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిని కలిసిన శాపురం నర్సింహా రెడ్డి 98 ఏళ్ల వయసులోనూ ఓటు వేసి ఆదర్శంగా నిలిచిన....... లక్ష్మీ కాంతమ్మ వైసీపీకి సీనియర్ నాయకుడు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ మోర్ల సత్యనారాయణ (బాబురావు) రాజీనామా కృషి విజ్ఞాన్ కంపెనీలో ఈ నెల 10న జాబ్ మేళా.. స్వదేశీ జాగరణ మంచ్ పాలమూరు విభాగ్ విద్యా కో-కన్వీనర్‌గా చింతల మొగులప్ప నియామకం -అధికారి హోదాలోనే కాదు... సామాజిక బాధ్యతలోనూ ముందడుగు! --ఎంవీఐ వెంకటస్వామి ప్రోత్సాహం… ---43 మంది విద్యార్థులకు షేక్ లతీఫ్ ఆర్థిక భరోసా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి : ఎస్పీ నియోజకవర్గంలో పర్యటించిన జిల్లా ప్రత్యేక అధికారి, కలెక్టర్, ఎస్పీ తదితరులు బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్‌లో బాలబాలికలకు ప్రత్యేక శిక్షణ : సురేష్ విద్యుత్ పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు నేటి సాయంత్రానికి సరఫరా అందుబాటులోకి తెస్తాం: ప్రత్తిపాటి పుల్లారావు పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రూరల్ లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఒక్కసారి వాడే ప్లాస్టిక్‌కు నో చెప్పాలి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు

బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్‌లో బాలబాలికలకు ప్రత్యేక శిక్షణ : సురేష్

Select Suryaa Now
బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్‌లో బాలబాలికలకు ప్రత్యేక శిక్షణ : సురేష్

 

సూర్య - పెద్దపల్లి: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టును త్వరలో ప్రారంభించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎ. సురేష్ తెలిపారు.
గురువారం ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కోర్టును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్‌లో బాలబాలికలకు కోచ్ ద్వారా ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. కోర్టు వినియోగానికి రూ.1,000 రిజిస్ట్రేషన్, నెలకు రూ.1,000 రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణకు నెలకు రూ.800, గంటపాటు బ్యాడ్మింటన్ ఆడేందుకు రూ.300 రుసుము నిర్ణయించినట్లు తెలిపారు.
కోర్టు ఉదయం 5.30 నుంచి 9.30 వరకు, సాయంత్రం 5 నుంచి 9.30 గంటల వరకు అందుబాటులో ఉంటుందని, క్రీడాకారులు తప్పనిసరిగా బ్యాడ్మింటన్ షూస్ ధరించాలని సూచించారు. ఆసక్తి గలవారు జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలోని గది నంబర్ 232లో నమోదు చేసుకోవాలని, వివరాలకు 9963960063 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.