telangana
వారం రోజులుగా వృద్ధురాలి ఆచూకీ కరువు.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
మేడ్చల్, మేజర్ న్యూస్: మేడ్చల్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన అరువపల్లి మల్లమ్మ (భర్త: లేట్ రమేష్) అక్టోబర్ 28వ తేదీ ఉదయం 9 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. వారం రోజులు గడుస్తున్నా ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.మల్లమ్మ వద్ద మొబైల్ ఫోన్ లేకపోవడంతో ఆమె ఎక్కడికి వెళ్లారనే సమాచారం తెలియడం లేదు. కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసినవారి ఇళ్లతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా గాలించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో ఆమె కుమారుడు ఎస్. అనంతదాస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.అదృశ్యమైన వృద్ధురాలి ఎత్తు సుమారు 4 అడుగుల 6 అంగుళాలు, చామనచాయ రంగు, గుండ్రని ముఖం కలిగి ఉంటారని, ఆమెకు తెలుగు భాష మాత్రమే తెలుసని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఎక్కడైనా కనిపించినా, ఆచూకీ తెలిసినా వెంటనే కుటుంబ సభ్యులకు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి సహకరించాలని కోరుతున్నారు.సమాచారం ఇవ్వాల్సిన ఫోన్ నంబర్లు: 9639547765, 9912635504