BREAKING
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 70 శాతానికి పెంచాలి.. - కలెక్టర్ శ్రీహర్ష వారం రోజులుగా వృద్ధురాలి ఆచూకీ కరువు.. ఆందోళనలో కుటుంబ సభ్యులు ప్రభుత్వ బడుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలి: మాజీ ఎంపిటిసి నందం గణేష్ బాబు ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి - అదనపు కలెక్టర్ శ్రీరాములు అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే చర్యలు.. ఆక్రమిత భూముల రిజిస్ట్రేషన్‌పై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి రూ.9,100 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.. మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన ప్రత్యేక అధికారి పి. ప్రశాంతి ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి రాష్ట్ర స్థాయి సమీక్షా బృందం పర్యటన నగరం మండలంలో 71.55 శాతం ఓటింగ్ ఐరోపాలో విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు పెళ్లి పీటలెక్కేముందు..ఓటు వేసిన పెళ్లికూతురు! ఎయిమ్స్ అవంతిపొరా పనులపై జేపీ నడ్డా సమీక్ష

ప్రభుత్వ బడుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలి: మాజీ ఎంపిటిసి నందం గణేష్ బాబు

Select Suryaa Now
ప్రభుత్వ బడుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలి: మాజీ ఎంపిటిసి నందం గణేష్ బాబు
ఘట్‌కేసర్ రూరల్, మేజర్ న్యూస్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతతో భాగస్వామి కావాలని మాజీ ఎంపీటీసీ నందం గణేష్ బాబు పిలుపునిచ్చారు. ఊరి బడి బలోపేతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించినప్పుడే ప్రభుత్వ విద్యారంగం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్‌కేసర్ డివిజన్ పరిధిలోని కొండాపూర్ ప్రాథమిక పాఠశాలకు పూర్తి స్థాయిలో రంగులు వేయించేందుకు సహకరించిన నందం గణేష్ బాబును గురువారం స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సంస్థ చేపట్టిన 'మన బడులు.. మన బాధ్యత' కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పుస్తకాన్ని బహూకరించారు.అనంతరం నందం గణేష్ బాబు మాట్లాడుతూ... భారత రాజ్యాంగం పౌరులకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా కల్పించిందని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ముందుకు రావాలని కోరారు. దాతల సహకారంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేందుకు స్ఫూర్తి ఆర్గనైజేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థులకు ఆహ్లాదకరమైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ల యాదయ్య, ఉపాధ్యక్షుడు మేకల పద్మారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముల్లి జంగయ్య యాదవ్, మాజీ సర్పంచ్ డక్కి రమేష్, గ్రామ పెద్దలు కొంతం లక్ష్మారెడ్డి, మందడి శ్రీనివాస్ రెడ్డి, మొలుగురం గణేష్, బొంత సుధాకర్, కొమ్మిడి శివకృష్ణారెడ్డి, ముత్యం రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు ఆర్. దాసు, లక్ష్మీ కల్పన, శివకుమార్, ఆర్గనైజేషన్ సభ్యులు కే. రాజేందర్ రెడ్డి, రాజు, చెన్నయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.