BREAKING
నియోజకవర్గంలో పర్యటించిన జిల్లా ప్రత్యేక అధికారి, కలెక్టర్, ఎస్పీ తదితరులు బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్‌లో బాలబాలికలకు ప్రత్యేక శిక్షణ : సురేష్ విద్యుత్ పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు నేటి సాయంత్రానికి సరఫరా అందుబాటులోకి తెస్తాం: ప్రత్తిపాటి పుల్లారావు పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రూరల్ లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఒక్కసారి వాడే ప్లాస్టిక్‌కు నో చెప్పాలి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 70 శాతానికి పెంచాలి.. - కలెక్టర్ శ్రీహర్ష వారం రోజులుగా వృద్ధురాలి ఆచూకీ కరువు.. ఆందోళనలో కుటుంబ సభ్యులు ప్రభుత్వ బడుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలి: మాజీ ఎంపిటిసి నందం గణేష్ బాబు ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి - అదనపు కలెక్టర్ శ్రీరాములు అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే చర్యలు.. ఆక్రమిత భూముల రిజిస్ట్రేషన్‌పై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి రూ.9,100 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.. మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన ప్రత్యేక అధికారి పి. ప్రశాంతి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 70 శాతానికి పెంచాలి.. - కలెక్టర్ శ్రీహర్ష

Select Suryaa Now
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 70 శాతానికి పెంచాలి..  - కలెక్టర్ శ్రీహర్ష

 

సూర్య - పెద్దపల్లి : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను ప్రస్తుతమున్న 50 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో గర్భిణులకు అందుతున్న వైద్య సేవలపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. పెద్దపల్లి మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో నెలకు కనీసం 300, గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 200 ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆశా కార్యకర్తల ద్వారా గర్భిణులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలపై అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందించి ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచాలన్నారు.
అనంతరం జాతీయస్థాయి ఎయిడ్స్ సురక్షిత కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా ప్రథమ స్థానం సాధించి అవార్డులు పొందిన సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.
ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ వై. పవిత్ర, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.