andhrapradesh
నియోజకవర్గంలో పర్యటించిన జిల్లా ప్రత్యేక అధికారి, కలెక్టర్, ఎస్పీ తదితరులు
సత్తెనపల్లి, ముప్పాళ్ల, న్యూస్ : మండల పరిధిలోని నందిగామ, ముప్పాళ్ల మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని గురువారం పల్నాడు జిల్లా ఎన్నికల పరిశీలకులు,సెంట్రల్ సివిల్ సప్లై అధికారి నుపూర్ పరిశీలించారు.పోలింగ్ జరుగుతున్న తీరు, భద్రత వ్యవహారాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను, ఓటింగ్ సరళిని, ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా తీసుకున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ కృతిక శుక్ల మండలంలోని ధూళిపాళ్ల గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని, ముప్పాళ్ల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పరిశీలించి ఉన్నారు. పోలింగ్ జరుగుతున్న తీరు, భద్రత వ్యవరములు పరిశీలించియున్నారు.