వైసీపీకి సీనియర్ నాయకుడు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ మోర్ల సత్యనారాయణ (బాబురావు) రాజీనామా
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: సీనియర్ వైసీపీ నాయకులు, సూరేపల్లి మాజీ సర్పంచ్, సురేపల్లి మాజీ పిఎసిఎస్ చైర్మన్ మోర్ల సత్యనారాయణ (బాబూరావు)పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు బుధవారం ఆయన వెల్లడించారు. కుటుంబ, ఆరోగ్య పరిస్థితులు మరియు వ్యక్తిగత కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి మరియు పార్టీలో నిర్వహిస్తున్న అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.ఇకపై రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని వేమూరు నియోజకవర్గ వైయస్సార్సీపి సమన్వయకర్త వరికూటి అశోక బాబుకు పంపనున్న ట్లు మోర్ల బాబురావు తెలిపారు. తనకు ఇప్పటివరకు సహకరించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సూరేపల్లి గ్రామంలో సర్పంచ్ గా, పిఎసిఎస్ చైర్మన్ గా ఆయన కుటుంబం సుదీర్ఘ కాలం సేవలు అందించిన మోర్ల సత్యనారాయణకు గ్రామంలో మంచి పట్టు, అనుచర వర్గం ఉంది. ఆయన రాజీనామా వేమూరు నియోజకవర్గ వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.