andhrapradesh
సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి : ఎస్పీ
నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని అబ్బూరు,, ముప్పాళ్ల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు.ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించడంలోభాగంగా పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.ఈ సందర్భంగా గ్రామంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన పోలీసు బందోబస్తు ఏర్పాట్లను, సిబ్బంది విధులను, సమస్యాత్మక ప్రాంతాలను మరియు ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యలను పరిశీలించారు.ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ గారు పలు సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, గ్రామంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు. వారితోపాటు ఆర్డీవో గోపాలకృష్ణ, డి.ఎస్.పి ఎం.వి కృష్ణ చైతన్య, తహసీల్దార్లు చక్రవర్తి నగేష్, సిఐలు కిరణ్, ఎంపీడీవోలు బండి శ్రీనివాసరెడ్డి,ఇన్చార్జి ఎంపీడీవో కేవీ శివప్రసాద్,, ప్రత్యేక అధికారులు, ఎస్సై అనిల్, సిబ్బంది తదితరులు ఉన్నారు