BREAKING
క్రీడా టోర్నమెంట్ల నిర్వహణ నుంచి పేద కుటుంబాలకు ఆర్థిక సాయం వరకు భక్తిశ్రద్ధలతో శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారి పునఃప్రతిష్ఠ మహోత్సవం మచ్చలేని మహనీయుడు మంత్రి దామోదర్ రాజనర్సింహ మేధావి రాష్ట్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర కే గర్వకారణం కావాలని దుష్ప్రచారం వెంటనే ఆపాలి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య మెథడిస్ట్ క్రిస్టియన్ జాతర వాహనాల పార్కింగ్ హక్కులకు నవంబర్ 7న బహిరంగ వేలం రికార్డు స్థాయికి అభివృద్ధి చెందుతున్న దేశాల విదేశీ రుణాలు దేశీయంగా ప్రీమియం వైన్‌లకు పెరుగుతున్న డిమాండ్ అధికారులు సమన్వయతో పనిచేసి గ్రామాలలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ ఎస్ రాయికోడ్‌లో ఘనంగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం ఉక్రెయిన్‌కు అదనంగా 100 మిలియన్ యూరోల మౌలిక వసతుల సహాయాన్ని ప్రకటించిన జర్మనీ *నీలం మధు ముదిరాజ్‌కు అవకాశం కల్పించాలి: తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి జహీరాబాద్ ఇంచార్జి రవి ముదిరాజ్ ఎన్ ఎమ్ ఆర్* కుటుంబ సమేతంగా ఓటు వేసిన వైసీపీ నేత వరికూటి అశోక్ బాబు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి - దేవునిపల్లె లో న్యాయ విజ్ఞాన సదస్సు వరద ఉధృతిలో చిక్కుకున్న ముగ్గురు మహిళలకు పోలీసుల రక్షణ! నడుముకు తాడు కట్టుకుని వరదలోకి దూకిన సీఐ సుబ్బనాయుడు సాహసోపేతంగా మహిళలను కాపాడిన పోలీసు సిబ్బంది.. హోంమంత్రి అనిత ప్రశంసలు తోషిబా కార్మిక సంఘం ఎన్నికల్లో చంద్రశేఖర్‌ను గెలిపించండి అక్రమంగా టపాసులు నిల్వ చేసినా.. విక్రయించినా కఠిన చర్యలు

*నీలం మధు ముదిరాజ్‌కు అవకాశం కల్పించాలి: తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి జహీరాబాద్ ఇంచార్జి రవి ముదిరాజ్ ఎన్ ఎమ్ ఆర్*

Select Suryaa Now
*నీలం మధు ముదిరాజ్‌కు అవకాశం కల్పించాలి: తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి జహీరాబాద్ ఇంచార్జి రవి ముదిరాజ్ ఎన్ ఎమ్ ఆర్*

జహీరాబాద్;తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ, కాంగ్రెస్ పార్టీ ప్రజా నాయకుడు నీలం మధు ముదిరాజ్‌కు ఎమ్మెల్సీ పదవి కేటాయించి సముచిత గౌరవం కల్పించాలని తెలంగాణ ముదిరాజ్ పోరాట తెలంగాణ సమితి జహీరాబాద్ ఇన్ఛార్జి రవి ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని కోరారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతున్న నీలం మధు ముదిరాజ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ముదిరాజుల సమస్యలను, హక్కులను వినిపించిన పోరాట యోధుడిగా ఆయన గుర్తింపు పొందారని పేర్కొన్నారు.యువతకు ఆదర్శంగా, పేదలకు ఆపద్బాంధవుడిగా, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న నీలం మధు ముదిరాజ్‌కు తెలంగాణవ్యాప్తంగా ప్రజాదరణ ఉందన్నారు. పదవుల కోసం కాకుండా ప్రజల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న నాయకుడికి తగిన గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందని తెలిపారు.సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ముదిరాజ్ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ పదవి కేటాయించడం ద్వారా రాజకీయ ప్రాతినిధ్యానికి పెద్దపీట వేయాలని కోరారు. నీలం మధు ముదిరాజ్‌కు ఎమ్మెల్సీ పదవి కల్పించి ముదిరాజ్ సమాజానికి తగిన రాజకీయ గౌరవం అందించాలని సుంకరబోయిన. రవి ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు.