telangana
మెథడిస్ట్ క్రిస్టియన్ జాతర వాహనాల పార్కింగ్ హక్కులకు నవంబర్ 7న బహిరంగ వేలం
ధారూర్, మేజర్ న్యూస్: ధారూర్ స్టేషన్ గ్రామంలో నవంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్న 104వ మెథడిస్ట్ క్రిస్టియన్ జాతరను పురస్కరించుకుని వాహనాల పార్కింగ్ హక్కుల కోసం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి కల్పన తెలిపారు. నవంబర్ 7వ తేదీ ఉదయం 10 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో వేలం ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు.వేలంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు అదే రోజు ఉదయం 10 గంటలలోపు రూ.2,000 నగదును అడ్వాన్స్‌గా చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వేలంలో పాల్గొనే వారికి గ్రామ పంచాయతీకి సంబంధించి ఎలాంటి పన్ను బకాయిలు లేదా ఇతర బకాయిలు ఉండకూడదని స్పష్టం చేశారు. బకాయిలు లేవని నిర్ధారించే సంబంధిత చెల్లింపు రశీదును తప్పనిసరిగా చూపించాలని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకుని వేలంలో పాల్గొనాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి కల్పన కోరారు.
రిపోర్టర్: సుధాకర్, ధారూర్, వికారాబాద్ జిల్లా.