మండల పోలింగ్‌లో శివల టాప్
కె గంగవరం, మేజర్ న్యూస్ :మండలంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వివిధ గ్రామాల పరిధిలో పోలైన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. కుందూరులో 2,007,బాలాంతరంలో 1,645, శివలలో 1,838, తాళ్లపూడిలో 1,324, కుడుపూరులో 1,726, దంగేరులో 2,204, బట్లపాలికలో 1,749,మసకపల్లిలో 2,150, కోటలో 2,085, కోటిపల్లిలో 2,413,అంజూరులో 2,210, పామర్రులో 1,231, ఎండగండిలో 1,356,సత్యవాడలో 2,157, కూళ్లలో 2,297, కే.గంగవరంలో 2,159, సుందరపల్లిలో 2,281, ఎర్రపోతవరంలో 1,861 ఓట్లు పోలయ్యాయి.శివల ఎంపీటీసీ పరిధిలో పోలింగ్ ప్రక్రియ తొలుత ముగిసింది. దీంతో పోలింగ్ ముగింపులో శివల ప్రథమ స్థానంలో నిలిచింది.