జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన బీజేపీ నేతలు.
పుల్లేటికుర్రు, టి.కొత్తపల్లిలో ఎన్నికల పరిస్థితుల పరిశీలన..
అమలాపురం మేజర్ న్యూస్ జిల్లాలో గురువారం నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జిల్లా నాయకులు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పుల్లేటికుర్రు, టి.కొత్తపల్లి గ్రామాల్లోని ఎన్నికల బూత్‌లకు వెళ్లి పోలింగ్ సరళిని, అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ తీరును సమీక్షిస్తూ స్థానిక నాయకులు, అభ్యర్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.*ఈ పర్యటనలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్ మోకా వెంకట సుబ్బారావు, ఎంపీటీసీ అభ్యర్థి కుడుపూడి సుబ్రహ్మణ్యం, అయ్యగారి కృష్ణ సుందరి, ఎంపీటీసీ అభ్యర్థిని దంతులూరి సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.