BREAKING
ప్రశాంతంగా ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 71.35 శాతం పోలింగ్ అమెరికాలో డేటా సెంటర్ల వ్యతిరేకత ప్రభావం మురుగు సమస్యను తక్షణమే పరిష్కరించిన కార్పొరేటర్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి మండల పోలింగ్‌లో శివల టాప్‌ చిట్టమూరులో ప్రశాంతంగా పోలింగ్..77.77 శాతం ఓటింగ్ నమోదు 7 బిలియన్ డాలర్ల సమీకరణే లక్ష్యంగా యాపిల్ బాండ్ జారీ జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన బీజేపీ నేతలు. అధికారుల సమక్షంలో అభివృద్ధి పనులపై సమీక్ష కాంగోలో చైనా రాగి గని కాలుష్యంపై తిరగబడిన స్థానికులు క్రీడా టోర్నమెంట్ల నిర్వహణ నుంచి పేద కుటుంబాలకు ఆర్థిక సాయం వరకు భక్తిశ్రద్ధలతో శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారి పునఃప్రతిష్ఠ మహోత్సవం మచ్చలేని మహనీయుడు మంత్రి దామోదర్ రాజనర్సింహ మేధావి రాష్ట్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర కే గర్వకారణం కావాలని దుష్ప్రచారం వెంటనే ఆపాలి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య మెథడిస్ట్ క్రిస్టియన్ జాతర వాహనాల పార్కింగ్ హక్కులకు నవంబర్ 7న బహిరంగ వేలం రికార్డు స్థాయికి అభివృద్ధి చెందుతున్న దేశాల విదేశీ రుణాలు

భక్తిశ్రద్ధలతో శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారి పునఃప్రతిష్ఠ మహోత్సవం

Select Suryaa Now
భక్తిశ్రద్ధలతో శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారి పునఃప్రతిష్ఠ మహోత్సవం

                            భక్తిశ్రద్ధలతో శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారి పునఃప్రతిష్ఠ మహోత్సవం

              పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్, మున్సిపల్ చైర్మన్ మేడిశెట్టి శేషారావు

రామచంద్రపురం మేజర్ న్యూస్ :రామచంద్రపురం పట్టణంలో వేంచేసియున్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారి పునఃప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పునఃప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ మేడిశెట్టి శేషారావు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చెరుకుపల్లి గణేష్ శర్మ, 25వ వార్డు కౌన్సిలర్ సత్యవాడ విజయలక్ష్మి, శ్రీహరి పంతులు దంపతులు, దంగేటి వీరభద్రరావు, దంగేటి గౌరీశంకర్, పంపన సుబ్బారావు, ఎం.ఎస్. వీరభద్రరావు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ పవిత్ర కార్యక్రమంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామివారి పునఃప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.