BREAKING
నేడే పరిషత్ ఫలితాలు.. పకడ్బందీగా ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు గచ్చిబౌలిలో అమెరికన్ పౌరుడి అనుమానాస్పద మృతి ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు దిశగా అడుగులు.. ఒక్కో ఆటగాడి నుంచి రూ. 40 కోట్ల భారీ డిమాండ్! పలాస, సాలూరు అభివృద్ధికి సంపూర్ణ సహకారం బాణసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి ఎస్సై ఏడుకొండలు క్రికెట్ చరిత్రలో సంచలనం.. కేవలం 15 ఏళ్ల వయసులో బీహార్ జట్టుకు కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ! జిల్లాలోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకున్న అంతర్జాతీయ వేదికపై చరిత్ర సృష్టించిన విజయ్ సేతుపతి.. తొలి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం! దుండిగల్‌లో దారుణం: యువతిపై కాళ్లు, చేతులు కట్టేసి దారుణంగా అత్యాచారం రామాయణంపై బడ్జెట్, వీఎఫ్ఎక్స్ చర్చలు సరికావు.. రాముడు, సీత గురించే మాట్లాడాలి: సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న ధనుష్, వెట్రిమారన్ క్రైమ్ థ్రిల్లర్.. రికార్డులను బ్రేక్ చేస్తున్న 'వడ చెన్నై'! అప్పన్న దర్శనానికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి ధరల మంటలో చిద్రమవుతున్న పేదోడి బతుకులు ఓటీటీని షేక్ చేస్తున్న వరుణ్ సందేశ్ క్రైమ్ థ్రిల్లర్.. వంద మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలు దాటిన 'నా వైఫ్ మిస్సింగ్'! దుర్గి : బాణసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి - దుర్గి ఎస్ఐ బి.గోపాల్

ప్రశాంతంగా ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 71.35 శాతం పోలింగ్

Select Suryaa Now
ప్రశాంతంగా ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 71.35 శాతం పోలింగ్

ఆత్రేయపురం మేజర్ న్యూస్ మండలంలోని 17 గ్రామాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది 71.35 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి వి.ఆర్. రుద్ర, తహసీల్దార్ ఆర్.డి. రామచంద్రమూర్తి, ఎంపీడీవో పి.వి.ఆర్.కె. రాజు తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.అయితే ఓటరు స్లిప్పుల పంపిణీలో జరిగిన లోపాలు పలువురు ఓటర్లను అయోమయానికి గురిచేశాయి. తమ ఓటు ఎక్కడ వేయాలి పోలింగ్ కేంద్రం ఏది అన్న సందేహాలతో కొందరు ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరుకు స్లిప్పులు పంపిణీ చేసేవారు. దీంతో ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకునేవారు. అయితే ఈసారి ఆ స్థాయిలో స్లిప్పుల పంపిణీ జరగకపోవడం చర్చనీయాంశంగా మారింది.రెవెన్యూ, మండల అభివృద్ధి శాఖ, గ్రామ సచివాలయాల సిబ్బంది సమన్వయంతో ప్రతి ఓటరుకు స్లిప్పులు అందించాల్సి ఉండగా, కొన్ని ప్రాంతాల్లో నామమాత్రంగా పంపిణీ చేసి మిగిలిన ఓటర్లను పట్టించుకోలేదన్న విమర్శలు వినిపించాయి.
మరోవైపు గత పది రోజులుగా తుఫాను, భారీ వర్షాల కారణంగా మండలంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టాలతో పాటు వివిధ వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇదిలా ఉండగా మండలంలోని 17 గ్రామాల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. గ్రామ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల సిబ్బందికి సహకరించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని సూచించారు.అలాగే ఏఎస్పీ మహేంద్ర, ఎన్నికల అధికారి వి.ఆర్. రుద్ర, తహసీల్దార్ ఆర్.డి. రామచంద్రమూర్తి, ఎంపీడీవో పి.వి.ఆర్.కె. రాజు వివిధ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓటర్లకు, ఎన్నికల సిబ్బందికి అవసరమైన సహకారం అందిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు