వలీమా వేడుకల్లో పాల్గొన్నా మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్
కోహిర్;కొహీర్ పట్టణంలోని ఎస్.ఎస్.ఫంక్షన్ హాల్ లో జరిగిన కోహీర్ మాజీ ఉప-సర్పంచ్ మోసిన్ గారి సోదరుని వలీమా కార్యక్రమానికి *మాజీ మంత్రివర్యులు,జహీరాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డా||ఎ.చంద్రశేఖర్ హాజరై నూతన వరుడుని ఆశీర్వదించారు.ఈ సందర్భంగా నూతన వరునికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పరస్పర ప్రేమానురాగాలతో నిండి ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామ లింగారెడ్డి , మండల అధ్యక్షులు సువర్ణ-మల్లన్న పాటిల్ , హుగ్గేల్లి రాములు , పవన్ రాథోడ్ ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ , మాజీ మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్ , మాజీ పట్టణ అధ్యక్షులు శంషీర్ అలీ ,సర్పంచులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..