ఘనంగా కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
సంగారెడ్డి;సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డికి నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్ఛాలు అందించి సత్కరించారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత సంతోష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, పలువురు కౌన్సిలర్లు, వార్డు ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకలను సందడిగా నిర్వహించారు.