BREAKING
యూరోపియన్ కార్పొరేట్ వృద్ధికి ఊతం *సంగారెడ్డి పట్టణం లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన నిర్మలా జగ్గారెడ్డి* పడవ ప్రయాణం చేసీ ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే గిడ్డి .. రామాయణం చిత్రంలో ది ప్యారడైజ్ విలన్ రాఘవ్ జుయల్: సర్‌ప్రైజ్ ఇస్తున్న నటుడి పాత్ర రావులపాలెం మండలంలో 68.92 శాతం పోలింగ్ నైజీరియా 2027 ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి అటికు అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన కోర్టు భూగర్భ జలాల పెంపునకు గ్రామ పంచాయతీ ప్రత్యేక చర్యలు కడియంలో 71.57శాతం పోలింగ్ నమోదు హోర్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లపై దాడులతో ఇరాన్ వ్యూహాత్మక ఒత్తిడి వైసీపీ చేజారుతుందా? కూటమికి పైచేయి దక్కుతుందా? విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్యే మసీద్ హుస్సేన్ ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య జర్మనీ నూతన రక్షణ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ క్రిస్టియన్ ఫ్రూడింగ్ నియామకం ఘనంగా కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు యూరోపియన్ అల్యూమినియం కొనుగోలుదారులపై పడుతున్న ప్రతికూల భారం

కడియంలో 71.57శాతం పోలింగ్ నమోదు

Select Suryaa Now
కడియంలో 71.57శాతం పోలింగ్ నమోదు

కడియం, మేజర్ న్యూస్ ,:కడియం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలవ్యాప్తంగా మొత్తం 71.57 శాతం పోలింగ్ నమోదైంది.
మండలంలో మొత్తం 62,081 మంది ఓటర్లు ఉండగా, వారిలో 44,436 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 78 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల అధికారులు ఓటింగ్ ప్రక్రియను నిర్వహించారు.ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాన అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుర్రిలంకలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి రత్నం మహేశ్వరి దేవి, వైకాపా జడ్పీటీసీ అభ్యర్థి కొత్తపల్లి నాగ శివాజీ ఓటు వేశారు. అదే గ్రామంలో వైకాపా ఎంపీపీ అభ్యర్థి తాడాల రాజరాజేశ్వరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కడియపులంకలో కూటమి ఎంపీపీ అభ్యర్థి బోడపాటి మోహిని వీర పుణ్యవతి ఓటు వేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మండలంలోని మాధవరాయుడుపాలెంలో స్వల్ప ఘర్షణ చోటుచేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటన మినహా మిగిలిన అన్ని గ్రామాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఎన్నికల అధికారులు, పోలీసు సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు.