పడవ ప్రయాణం చేసీ ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే గిడ్డి ..
పి.గన్నవరం మేజర్ న్యూస్ :మండలం, ఉడిమూడి లంక గ్రామంలో పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ సొంత ఊరు ఊడిమూడి లంక కు పడవపై ప్రయాణిస్తూ పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.