పోలీస్ స్టేషన్‌ను సందర్శించి కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన సీఐ కృష్ణమూర్తి
కొల్చార;మెదక్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. కృష్ణమూర్తి కొల్చారం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల స్థితిగతులు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతి, పెండింగ్ కేసుల వివరాలు, సిబ్బంది పనితీరుపై సమీక్ష నిర్వహించారు.అనంతరం పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ, స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, కేసుల దర్యాప్తులో నాణ్యత పాటించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై తక్షణమే స్పందించాలని సిబ్బందికి సూచించారు.అలాగే శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీస్ సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు అందించారు.