ఇంకొల్లు మండలంలో ప్రశాంతంగా ఎన్నికలు
ఇంకొల్లు, మేజర్ న్యూస్:
జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో మండలం ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంకొల్లు మండలంలో 52 బూతుల్లో ఓటర్లు బారులు తీరి ఓట్లు వేశారు. తుఫాను ప్రభావంతో, రవాణా వ్యవస్థ స్తంభించడంతో ఇతర ప్రాంతాల నుండి ఓటర్లు రాకపోవడంతో ఓటింగ్ శాతం తగ్గింది. ఇంకొల్లు ఎస్సై బి వినోద్ కుమార్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఇంకొల్లు మండల ఎన్నికల అధికారి కే రమేష్ బాబు, ఇంకొల్లు మండల అభివృద్ధి అధికారి జి శ్రీనివాసరావు, తహసిల్దారు ఏ వి ఎస్ శ్రీనివాస్, ఇంకొల్లు మండల విద్యాశాఖ అధికారి ఏ శ్రీనివాసరావు ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు.