కొత్త బోర్లు వేయరాదు అనుమతులు తప్పనిసరి లేనియెడల కఠిన చర్యలు తహసిల్దార్ ఆశ జ్యోతి
రాయికోడ్;మండలంలోని ప్రజలు ఎవ్వరు కూడా నూతన బోర్లు వేయరాదని తహసిల్దార్ ఆశ జ్యోతి గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు ఎల్ ని నో ప్రభావం వల్ల భూగర్భ జలాలు అడగంటడం గడిచిన వర్షాకాలంలో అనుకున్న స్థాయిలో వర్షాలు కురవకపోగా విపరీతమైన ఎండలు ఉండటం తదితర కారణాల వలన నీటి శాతం తగ్గిపోవడం జరిగిందని తెలిపారు ప్రస్తుతం ఉన్న నీటి వనరులను కాపాడుకోవడానికి నీటి కష్టాలు రాకుండా ఉండటానికి మండల పరిధిలో వ్యవసాయ భూములలో మరియు గ్రామాల పట్టణాలలో కూడా ఎటువంటి నూతన బోర్లను తవ్వడానికి వీలు లేదన్నారు ఒకవేళ అధికారుల మాటలను బేఖాతరు చేసి ఎవరైనా అనుమతులు లేకుండా బోర్లు వేస్తే కఠిన చర్యలు తప్పవు అని తహసిల్దార్ ఆశాజ్యోతి హెచ్చరించారు ఒకవేళ బోరు వేస్తే అధికారులకు పూర్తి సమాచారం ఇవ్వాలని తెలిపారు లేనియెడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు