BREAKING
రావులపాలెం మండలంలో 68.92 శాతం పోలింగ్ నైజీరియా 2027 ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి అటికు అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన కోర్టు భూగర్భ జలాల పెంపునకు గ్రామ పంచాయతీ ప్రత్యేక చర్యలు కడియంలో 71.57శాతం పోలింగ్ నమోదు హోర్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లపై దాడులతో ఇరాన్ వ్యూహాత్మక ఒత్తిడి వైసీపీ చేజారుతుందా? కూటమికి పైచేయి దక్కుతుందా? విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్యే మసీద్ హుస్సేన్ ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య జర్మనీ నూతన రక్షణ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ క్రిస్టియన్ ఫ్రూడింగ్ నియామకం ఘనంగా కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు యూరోపియన్ అల్యూమినియం కొనుగోలుదారులపై పడుతున్న ప్రతికూల భారం *ఖేడ్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కర్* పదవీ విరమణ చేసిన హోంగార్డులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెక్కులు అందజేసిన జిల్లా ఎస్పీ వేదమంత్రోచ్ఛారణలు.. అయ్యప్ప స్వాముల భజనలతో మార్మోగిన నవరత్నాలయం ఓటరు స్లిప్పుల పంపిణీలో లోపాలా..? తుఫాను ప్రభావమా..?

వేదమంత్రోచ్ఛారణలు.. అయ్యప్ప స్వాముల భజనలతో మార్మోగిన నవరత్నాలయం

Select Suryaa Now
వేదమంత్రోచ్ఛారణలు.. అయ్యప్ప స్వాముల భజనలతో మార్మోగిన నవరత్నాలయం

సంగారెడ్డి;అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్ర వేడుకలను పురస్కరించుకుని శ్రీ నవరత్నాలయ దేవస్థానంలో వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సాహితీ హాస్పిటల్ అధినేత రాము గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పడిపూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అర్చకులు రాఘవేంద్ర జోషి వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారిని కొలిచారు. అయ్యప్ప స్వాముల భజన పాటలు, భక్తి గీతాలతో నవరత్నాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.అనంతరం స్థానిక జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆవరణలో భక్తులు, రోగులు, వారి సహాయకులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తి, సేవాభావంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది.