ఖేడ్ సమస్యలపై మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న స్థానికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఉన్నప్పటికీ నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో అనేక సమస్యలు రోజురోజుకు వెలువెత్తుతున్నాయి ఆ సమస్యలపై పట్టించుకునే నాధుడే లేడని బుధవారం మున్సిపల్ కౌన్సిలర్ పత్తి రామకృష్ణ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల యొక్క కనీస సౌకర్యాలను కూడా స్థానిక నాయకులు అధికారులు నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది దీనిపై బుధవారం మున్సిపల్ కమిషనర్ కి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు