BREAKING
ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ హిమాన్షు శుక్ల ఖేడ్ సమస్యలపై మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు *పేదవాడి సొంతింటి కల సహకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ ఛైర్మన్ దారం శంకర్* ప్రజా సమస్యలపై గళం విన్పిస్తా - కౌన్సిలర్ స్వప్న ఒకే దెబ్బకు రెండు ప్రపంచ రికార్డులు.. సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ లిథియం, నికెల్ ప్రాసెసింగ్‌కు రూ. 2,814 కోట్లు కావేరి హాస్పిటల్ ఆధ్వర్యంలో ‘సమత్వ’ ఆవిష్కరణ పెద్దపంజాణి మండలంలో 45,284 మంది ఓటర్లు - పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం ఆత్మకూరులో క్రికెట్ టోర్నమెంట్స్ క్రికెట్ చరిత్రలో సంచలనం.. తొలి ఆరు ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగుల వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన బ్యాటర్ బ్రిటన్ సుప్రీంకోర్టులో 'పాలస్తీనా యాక్షన్' నిషేధంపై విచారణ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. డి.ఎస్.పి దైవప్రసాద్. ఉత్తరాఖండ్ ట్రెక్కింగ్ ప్రమాదం: ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి పోలింగ్‌కు ఆటంకం కలిగిస్తే క్రిమినల్ కేసులు ఇటలీ పౌరుల వైద్య ఖర్చులను మాఫీ చేసిన స్విట్జర్లాండ్

ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు. కంబదూరు ఎస్సై లోకేష్.

Select Suryaa Now
ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు. కంబదూరు ఎస్సై లోకేష్.

**కంబదూరు:** మండల పరిధిలో రేపు జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కంబదూరు ఎస్ఐ లోకేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సందర్భంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, అసాంఘిక చర్యలకు దిగినా, ప్రజల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే విధంగా వ్యవహరించే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఓటరు ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ప్రత్యర్థులపై దాడులు, దూషణలు, బెదిరింపులకు పాల్పడరాదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వ్యక్తిగత విభేదాలు, రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి సంయమనంతో వ్యవహరించాలని కోరారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని తెలిపారు. ఎవరైనా శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేసినా, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో పోలీసు శాఖకు ప్రజలు సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ లోకేష్ కోరారు. ప్రజలందరి సహకారంతో ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.