BREAKING
రెండవ త్రైమాసికంలో దుమ్మురేపిన అపోలో హాస్పిటల్స్ ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా రాకేష్ వర్రె 'మాయ లేడీ' ట్రైలర్ ఎన్నికల విధుల్లో 11 వేల మంది సిబ్బంది, 3 వేల మంది పోలీసుల నియామకం - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల జర్మనీ మార్కెట్‌లో ఎలాన్ మస్క్ టెస్లా హవా రేణిగుంటలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్ల తనిఖీ మెగాస్టార్ చిరంజీవి 'కాకా' సినిమా థియేట్రికల్ హక్కులపై భారీ చర్చ.. రూ. 70 కోట్ల టార్గెట్! నార్త్ అమెరికా కాఫీ యూనిట్‌ను విక్రయించనున్న క్రాఫ్ట్ హేంజ్ ఇరాన్ యుద్ధం, వాణిజ్య విధానాలపై ప్రపంచ దేశాల ఉత్కంఠ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'టైసన్ నాయుడు' నుంచి అదిరిపోయే మాస్ సాంగ్ అప్‌డేట్ ప్రమాద బాధితుడు రమణయ్యను పరామర్శించిన టిడిపి నాయకులు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఊహించని పరిణామం రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కోహెడ ఏఎంసి చైర్మన్ బోయిని నిర్మల జయరాజు చిరుధాన్యాలతో ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లపై అవగాహన టెక్సాస్‌లో ఎలాన్ మస్క్ వ్యాపార సామ్రాజ్యంపై రాజకీయ సంక్షోభం మాంటెనెగ్రోకు త్వరలో ఈయూ సభ్యత్వం

పేదల సొంతింటి కల నిజం చేసిన ప్రజా ప్రభుత్వం

Select Suryaa Now
పేదల సొంతింటి కల నిజం చేసిన ప్రజా ప్రభుత్వం

సూర్య తాడ్వాయి :కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం, నిరుపేద కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది.ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు మంజూరు చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల జరిగిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణంలో ముగిసింది. ఈ సందర్భంగా ఇళ్లు పొందిన తాడ్వాయి మండలం నందివాడ గ్రామానికి చెందిన ఎరుపుల సాయిలు లబ్ధిదారులు భావోద్వేగానికి లోనవుతూ, ప్రభుత్వానికి మరియు స్థానిక నాయకులకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
కార్యక్రమంలో తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండారి సంజీవులు, పిఎసిఎస్ చైర్మన్ తాడ్వాయి సుధాకర్ రావు, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, సర్పంచ్ పోశయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు బాల సాయిలు,మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజలింగం, గ్రామ విడిసి అధ్యక్షులు బాలచంద్రం , పండరి, నామరాజు మంతిన్నారాయణ,బక్క రాజలింగం పాల్గొన్నారు.