చిరుధాన్యాలతో ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లపై అవగాహన
విజయవాడ, మేజర్ న్యూస్: బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లో నాలుగో రోజు కార్యక్రమాలు నిర్వహించారు. చిరుధాన్యాలతో ఆరోగ్యకరమైన ఆహార విధానాలను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా విద్యార్థులు, సిబ్బందికి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఐటీఐ ప్రిన్సిపాల్ ఎం. కనకరావు మాట్లాడుతూ ఆధునిక ఆహారపు అలవాట్లలో చిరుధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పోషక విలువలున్న సంప్రదాయ ఆహార పదార్థాలను రోజువారీ భోజనంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడతాయని తెలిపారు.
చిరుధాన్యాల సాగుకు తక్కువ నీరు అవసరమని, పర్యావరణానికి అనుకూలంగా ఉండటంతో పాటు రైతులకు, వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. స్థానికంగా లభించే పోషకాహారాన్ని ప్రోత్సహించడం, ఆహార వృథాను అరికట్టడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవడంపై అవగాహన కల్పించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.