ఆత్మకూరు జడ్పిటిసి బరిలో నలుగురు అభ్యర్థులు - ఇద్దరి మధ్యనే పోటీ
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మండలంలోని జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పిటిసి) స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉండగా ఇద్దరు మధ్యనే పోటీ నెలకొంది. తెలుగుదేశం అభ్యర్థిగా కూటమి ఆధ్వర్యంలో డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా పెమ్మసాన్ని ప్రసన్నలక్ష్మి, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా జ్యోతి శ్రీనివాసులు, స్వతంత్ర అభ్యర్థిగా కటారి నాగవర్ధన్ పోటీలో ఉన్నారు. మండలంలో తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ఉండగా చెర్లో ఏడవల్లి ఎంపిటిసి స్థానం నుండి ఎంపీటీసీ అభ్యర్థిగా మాజీ ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాంతో ఈ సెగ్మెంట్లో జడ్పిటిసి సభ్యులకు మాత్రమే పోలింగ్ జరగనుంది. మిగతా సెగ్మెంట్లు వాసిలి, పడకండ్ల, నువ్వురుపాడు, మహిమలూరు, మురుగళ్ళ, బట్టేపాడు, అప్పారావు పాలెం,కరటంపాడు ఎంపిటిసి స్థానాల్లో జడ్పిటిసి అభ్యర్థికి, ఎంపీటీసీ అభ్యర్థులకు ఓట్లు వేయాల్సి ఉంది. పోలింగ్ కోసం అధికారులు అన్ని చర్యలు తీసుకొని అన్నింటిని సిద్ధం చేశారు. గురువారం పోలింగ్ జరగనుండగా శనివారం ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి జరగనుంది.