30ఏళ్ల ఆర్మీ సేవకు ఘన సత్కారం
*--ఓపెన్‌టాప్ జీపుపై సుబేదార్ గోపాల్‌కు గ్రామంలో ఘన స్వాగతం.*
నవాబుపేట సూర్య న్యూస్:మండల పరిధిలోని జంగమయ్యపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ సుబేదార్ గోపాల్‌కు గ్రామస్థులు ఘన స్వాగతం పలికి సత్కరించారు.భారత సైన్యంలో 30సంవత్సరాల పాటు జవానుగా,సుబేదార్‌గా సేవలందించిన ఆయన గత నెల 31న పదవీ విరమణ పొందారు.ఈ సందర్భంగా బుధవారం నవాబుపేట మండల కేంద్రం నుంచి జంగమయ్యపల్లి గ్రామం వరకు ఓపెన్‌టాప్ జీపుపై ప్రత్యేక ఊరేగింపు నిర్వహిస్తూ గ్రామానికి ఘనంగా తీసుకువచ్చారు.అనంతరం గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన సన్మాన సభలో గ్రామస్థులు,యువకులు ఆయనను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం మూడు దశాబ్దాల పాటు సైన్యంలో సేవలందించిన గోపాల్ సేవలు అభినందనీయమని కొనియాడారు.ఆయనను ఆదర్శంగా తీసుకొని యువత దేశ సేవకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విశాల శివకుమార్,మాజీ సర్పంచ్ వెంకటేష్,బీజేపీ నాయకురాలు బాలా త్రిపుర సుందరి,బీసీ నాయకులు బాలయ్య,యువకులు,గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.