ప్రమాద బాధితుడు రమణయ్యను పరామర్శించిన టిడిపి నాయకులు.
కావలి, మేజర్ న్యూస్ : కావలి పట్టణంలోని 12వ వార్డు నివాసి, ప్రముఖుడు నటుకుల రమణయ్య ఇటీవల ప్రమాదానికి గురై గాయపడిన విషయం తెలుసుకున్న స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనను పరామర్శించారు. బుధవారం టిడిపి 12వ వార్డు ఇన్చార్జి గాదంశెట్టి వేణుగోపాల్, ఆర్యవైశ్య నాయకుడు అనుమాల శెట్టి శివ నేతృత్వంలోని బృందం రమణయ్య గృహానికి వెళ్లి ఆయనను, వారి కుటుంబ సభ్యులను నేరుగా కలిశారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రమణయ్య త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని వారు ఆకాంక్షించారు. బాధితుడి కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని ఈ సందర్భంగా నాయకులు భరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో టిడిపి వార్డు నాయకులు, ఆర్యవైశ్య ప్రముఖులు మరియు స్థానికులు పాల్గొన్నారు.