BREAKING
విదేశీ పాస్‌పోర్ట్‌లతో బాలీవుడ్‌లో రాణిస్తున్న ప్రముఖ నటులు.. జాబితాలో అగ్రశ్రేణి తారలు యూఎస్ ఎన్నికల ఫలితాలపై ప్రపంచ దేశాల స్పందన *గ్రామ పంచాయతీ ఆవరణలో గల ఇంకుడు గుంత, కమ్యూనిటీ ఇంకుడు, బోర్వెల్ రీఛార్జ్ ముగ్గు పోసి ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్ కాంగ్రెస్ పరాజయంపై రిపబ్లికన్లు, ట్రంప్ స్పందన ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని స్పృహ కోల్పోయి మృతిచెందిన స్పానిష్ ఆటగాడు అమెరికా కాంగ్రెస్‌లో డెమొక్రాట్ల హవా కావలిలో వీధి ఆవుల స్వైరవిహారం తక్షణమే కట్టడి చేయాలి ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ జోరు.. తొలి రోజే మూడు పతకాలు కైవసం నిబంధనలను ఉల్లంఘించి బెల్ట్ షాప్ లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం:మునుగోడు ఎస్సై మొగుళ్ళ శోభన్ బాబు విద్యా విధానంలో మానసిక వికాసం: త్రిపుర, ఉత్తరాఖండ్‌లకు ప్రశంసలు రైతు మేళా, సీఎం సభ ఏర్పాట్లపై ఎస్పీ స్నేహ మెహ్ర క్షేత్రస్థాయి పరిశీలన అమెరికా లేబర్ మార్కెట్‌లో సానుకూలత ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన అవనిగడ్డలో పోలింగ్ సామగ్రి పంపిణీ, ఓట్ల లెక్కింపు కేంద్రాల తనిఖీ కోహ్లీ హాఫ్ సెంచరీ, అర్ష్‌దీప్ 4 వికెట్లు.. అయినా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అన్షుల్ కాంబోజ్‌కే ఎందుకంటే? ఈక్విటాస్ బ్యాంక్ తాత్కాలిక సీఈవోగా బాలాజీ నూతలపాటి

ఎన్నికల విధుల్లో 11 వేల మంది సిబ్బంది, 3 వేల మంది పోలీసుల నియామకం - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

Select Suryaa Now
ఎన్నికల విధుల్లో 11 వేల మంది సిబ్బంది, 3 వేల మంది పోలీసుల నియామకం - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

వెంకటాచలం,   మేజర్ న్యూస్ :    జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల వెంకటాచలం, గూడూరులో ఏర్పాటుచేసిన రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో  ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందితో మాట్లాడి, వారికి కేటాయించిన విధులు, ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 34 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ అందించినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 1,568 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.  ఎన్నికల విధుల నిర్వహణకు సుమారు 11 వేల మంది సిబ్బందిని, భద్రతా ఏర్పాట్లలో భాగంగా 3 వేల మంది పోలీసులను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపునిచ్చారు.