పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి*
*పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి*
*మాజీ జెడ్పిటిసి పద్మ నరసింహ ముదిరాజ్*
తలకొండపల్లి, రంగారెడ్డి : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని మాజీ జడ్పిటిసి పద్మ నరసింహ ముదిరాజ్ కోరారు. వెల్జాల్, గట్టు ఇప్పలపల్లి, చౌదర్ పల్లి, గ్రామాలలో BRS ఆధ్వర్యంలో చేపట్టిన పట్టభద్రుల ఓటర్ నమోదును వారు పరిశీలించారు. ఓటు హక్కు పొందేందుకు అర్హత ఉన్న పట్టభద్రులు ఓటర్ గా నమోదు చేసుకోవాలని తెలిపారు. పట్టభద్రుల ఓటు నమోదు చేయడంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, చురుకుగా పాల్గొనాలన్నారు. ఓటర్ నమోదు లో గ్రామాల వారిగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్లను గుర్తించి నమోదు చేయించాలని తెలిపారు. ఈ సమావేశంలో తలకొండపల్లి మాజీ సర్పంచ్ లలిత జోతయ్య, వెల్జాల్ సర్పంచ్ వానరాసి రాములమ్మ M/o వెంకటేష్, ఉపసర్పంచ్ విజయలక్ష్మి విజయ్ కుమార్, జిల్లా మాజీ కో అప్షన్ సభ్యుడు ముజ్జుబుర్ రెహమాన్, వార్డు సభ్యులు శేఖర్ యాదవ్, ఎన్నికల పరిశీలకుడు బి. చందు, పి. రాజు, రాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- చప్పిడి తిరుపతి, మేజర్ న్యూస్.