BREAKING
జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల కు అంతా సిద్ధం ఎన్నికలు ప్రశాంత నిర్వహణకు సిబ్బంది కి ధన్యవాదాలు చందుపట్ల గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి వైసీపీ కంచుకోటలో కమలం పాగా .... ఎన్నికలకు సర్వం సిద్ధం! అమెరికాలో తొలి ముస్లిం సెనేటర్‌గా అబ్దుల్ ఎల్-సయ్యద్ చరిత్ర న్యాయమే గెలిచింది.. నా భర్త గెలిచాడు... రిపబ్లికన్ల ఓటమిపై ఎలాన్ మస్క్ వ్యంగ్య పోస్ట్ *జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై నిరంతర పర్యవేక్షణ... సిరా చుక్కే.. మండల భవితకు దిక్సూచి! యూఎస్‌లో రెండేళ్ల రాజ్యాంగ ఘర్షణ తప్పదా? రజినీకాంత్ 'ధర్మన్' చిత్రంలోకి యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఎంట్రీ.. నయనతారతో పాటు కీలక పాత్రలో నటి! శబరిమలకు అనిల్ స్వామి మహా పాదయాత్ర ప్రారంభం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం ....ఓటర్లు 49,469, పోలింగ్ 55, కేంద్రాలు పోలింగ్ సిబ్బంది 425 … నాగర్ కర్నూల్ లో గంజాయి తాగుతున్న ఇద్దరు యువకుల పై కేసు నమోదు,, ఎస్ఐ వెంకటరెడ్డి

లోతుకుంట తండాకు త్వరలో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు.. బస్సు రూట్‌పై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టిన కోస్గి డిపో మేనేజర్

Select Suryaa Now
లోతుకుంట తండాకు త్వరలో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు.. బస్సు రూట్‌పై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టిన కోస్గి డిపో మేనేజర్

బొంరాస్‌పేట్, మేజర్ న్యూస్: మండల పరిధిలోని మెట్లకుంట, లోతుకుంట తండా ప్రజలకు త్వరలో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించే దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. మహబూబ్‌నగర్ రీజినల్ కార్యాలయంలో ఎంపీ డీకే అరుణకు స్థానికులు అందించిన విజ్ఞప్తి మేరకు బుధవారం కోస్గి ఆర్టీసీ డిపో మేనేజర్ లోతుకుంట తండా వరకు బస్సు రాకపోకలకు అనువైన మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా తండాకు వెళ్లే రహదారి పరిస్థితులు, బస్సు ప్రయాణానికి అనుకూలతలు, రూట్ మ్యాప్ తదితర అంశాలను పరిశీలించి వివరాలు సేకరించారు. తండాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులోకి వస్తే విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, వృద్ధులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తండా ప్రజలకు బస్సు సౌకర్యం కల్పిస్తే ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న తమ విజ్ఞప్తిపై అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన తదుపరి చర్యలు పూర్తి చేసి బస్సు సర్వీసు ప్రారంభించాలని కోరుతున్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో బీజేపీ మండల నాయకుడు ఉప్పు జగదీశ్వర్, సీనియర్ నాయకులు రాజారాం రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.