BREAKING
అమెరికాలో భయానక విమాన ప్రమాదం..నేలకొరిగిన లియర్ జెట్ కొత్తూరు మండలంలో ఎన్నికల ఏర్పాట్లు. * 450మంది సిబ్బంది నియామకం * ఇండియన్ సినిమా స్థాయిని పెంచే గొప్ప ప్రయత్నం.. 'రామాయణం'పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు! ఎన్నికల విధులకు బస్సులు .. ప్రయాణికులకు తిప్పలు! జైపూర్‌లో డిజిటలైజేషన్‌కు మార్చి 2027 గడువు విధించిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఎన్నికలు ప్రశాంత నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు బద్వేల్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దివ్య తేజకు ఘనంగా సన్మానం .. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు టాలీవుడ్‌పై విమర్శలకు పాయల్ రాజ్‌పుత్ గట్టి కౌంటర్.. నేను గర్వించదగ్గ తెలుగు నటిని అంటూ వ్యాఖ్యలు! జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అలైన్ పాండే సీమంతం వేడుకలో సందడి చేసిన 'సయ్యారా' జోడీ.. సరదా ఆటలతో అదరగొట్టిన అహాన్ పాండే, అనీత్ పద్ద పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం * ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ * బాలల ఆరోగ్య వికాసానికి కృషి చేయాలి *ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలును ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మల జయరాజ్ నాటుసారా తయారీ కట్టడి చెయ్యాలి పంకజ్ త్రిపాఠి, అదితి రావు హైదరి 'పరివారిక్ మనోరంజన్' ట్రైలర్ రిలీజ్.. నవ్వులు పంచుతున్న క్రేజీ కాంబినేషన్!

జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం ....ఓటర్లు 49,469, పోలింగ్ 55, కేంద్రాలు పోలింగ్ సిబ్బంది 425 …

Select Suryaa Now
జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం   ....ఓటర్లు 49,469,  పోలింగ్ 55, కేంద్రాలు పోలింగ్ సిబ్బంది 425 …

చీపురుపల్లి మేజర్ న్యూస్:

మండలంలో గురువారం జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు సర్వం సిద్ధం అయ్యాయి. మండలంలో పోలింగ్ కేంద్రాలు 55, పోలింగ్ అధికారులు 61 మంది, సహాయ పోలింగ్ అధికారులు 61 మంది, ఇతర ఎన్నికల సిబ్బంది 303 మంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. 49.469 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఒక జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. టీడీపీ నుంచి వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, వైసీపీ నుంచి బెల్లాన వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు.  18 ఎంపీటీసీ స్థానాలకు 40 నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే.  చీపురుపల్లి 1 అభ్యర్థిగా ఇజ్జిరోతు నిహారిక (టీడీపీ), వైసీపీ నుంచి మహంతి లక్ష్మీ, చీపురుపల్లి 2 సబ్బి సోనియా (టీడీపీ), అడ్డూరి కృష్ణారావు (వైసీపీ), చీపురుపల్లి 3 మీసాల కాశీ విశ్వేశ్వరరావు (టీడీపీ), ముల్లు పైడిరాజు (వైసీపీ),  చీపురుపల్లి 4 నుంచి గవిడి నాగరాజు (టీడీపీ), ఇప్పిలి అనంతం (వైసీపీ), వంగపల్లి పేటలో వెంపడాపు హైమవతి (టీడీపీ), వెంపడాపు వెంకటరత్నం (వైసీపీ), చీపురుపల్లి 6 నుంచి కోట్ల కృష్ణ (జనసేన), కోసిరెడ్డి రమణ (వైసీపీ), రామలింగాపురం సారిక రామారావు (టీడీపీ), ఇప్పిలి వెంకట నర్సమ్మ (వైసీపీ), కర్లం నుంచి బాణాన రమణ (వైసీపీ), పొన్నాడ మహేశ్వరరావు (టీడీపీ), పేరిపి లో కోరాడ కోటేశ్వరరావు (టీడీపీ), లెంక రాజారావు (వైసీపీ), కరకాం నుంచి దన్నాన పద్మావతి (టీడీపీ), మీసాల వెంకటరమణ (వైసీపీ), నిమ్మలవలసలో పినిపిల్లి సుజాత (టీడీపీ), పెంట ముగతమ్మ (వైసీపీ), రావివలస నుంచి శనపతి నవ్య (టీడీపీ), కొమ్ము పద్మజ (వైసీపీ), ఇటకర్లపల్లి లో పాండ్రంకి కళావతి (టీడీపీ), రెడ్డి శాంతమ్మ (వైసీపీ), పెదనడిపల్లిలో సప్ప లక్ష్మీ (టీడీపీ), ఇప్పిలి గౌరీదేవి (వైసీపీ), అలజంగి లో శనపతి శ్రీదేవి (టీడీపీ), మీసాల జ్యోతి (వైసీపీ), మెట్టపల్లి లో వెంపడాపు రాజేశ్వరి (టీడీపీ), మీసాల శారద (వైసీపీ), జనసేన నుంచి పీకే పాలవలస లో బైరెడ్డి మణికంఠ, బైరెడ్డి తవుడమ్మ (వైసీపీ), గొల్లల ములగాం లో చందక దుర్గా భవాని (టీడీపీ), కరిమజ్జి పద్మ (వైసీపీ), స్వతంత్ర్య అభ్యర్థులుగా నిమ్మలవలస నుంచి అలికాన ధనలక్ష్మి, కర్లం నుంచి దుగ్గు రామకృష్ణ, ఇటకర్లపల్లి నుంచి పాండ్రంకి మంగమ్మ, కరకం నుంచి మంత్రి సత్యనారాయణ  లు పోటీలో ఉన్నారు.