కొత్తూరు మండలంలో ఎన్నికల ఏర్పాట్లు. * 450మంది సిబ్బంది నియామకం *
కొత్తూరు, సూర్య : కొత్తూరు మండలంలో 71పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అన్నాదొర తెలియజేశారు.71 పోలింగ్ కేంద్రాలలో 450మందిఎన్నికల సిబ్బంది ని నియమించారు. 71మంది పోలింగ్ అధికార్లు ,71 మంది ఎ పి ఓ లు నియమించినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి నలుగురు ఓ పి ఓ లను నియమించామని ఆయన వెల్లడించారు. వీరు కాకుండా రిజర్వు లో కొంతమందిని నియమించినట్లు తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఆరు జోన్లు ,9రూట్లు గా విభజించినట్లు వెల్లడించారు.ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కుంటిభద్ర,కొత్తూరు అత్యంత సమస్యత్మాక గ్రామాలుగా ,మాతల ,మెట్టూరువన్ ,కాలిగాం ,నివగాం ,మెట్టూరు 3 ,బమ్మిడి గ్రామాలు సమస్యత్మాక గ్రామాలుగా గుర్తించారు. ఈ గ్రామాల్లో కొత్తూరు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.