నాటుసారా తయారీ కట్టడి చెయ్యాలి
పాలకొండ, సూర్య : పాలకొండ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ ను జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ కె . సహదేవ సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ లో గవర్నమెంట్ రెవెన్యూ మరియు క్లైమ్ కు సంబందించి రివ్యూ చేయడం జరిగింది. పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, భామిని నాలుగు మండలాలలో స్థానిక ఏన్నికల సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటన లు జరగకుండా నాటు సారాయి తయారీ, రవాణా, కలిగి వుండుట అమ్మకాలు చేయడం చేసిన యెడల కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి అని తెలియజేసినారు మరియు అక్రమ మద్యం, సారాయి నియంత్రణకు టీం ను నియమించడం జరిగినది అని తెలియజేసునారు. ఈ సమావేశం లో ఎక్సైజ్ సీఐ కె . సూర్య కుమారి , ఎసై లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. తదుపరి స్థానిక ఏన్నికల సందర్భంగా సీతంపేట మండలం లో రసూలపేట గ్రామం లో దాడులు చేసి నాటు సారాయి తయారీ కి ఉపయోగపడే 640 లీటర్స్ పులిసిన బెల్లాపూవుటలను ద్వంసంచేయడం అయినది అని తెలియజేసినారు. తదుపరి స్థానిక ఎన్నికల సందర్బంగా వీరఘట్టం మండలం లో ఎక్సైజ్ సీఐ , ఎసై మరియు సిబ్బంది మరియు వీరఘట్టం ఫ్లైయింగ్ స్క్వాడ్ డీటీ పెట్రోలింగ్ చేయగా వీరఘట్టం లో ఒక వ్యక్తి 17 మద్యం సీసాలు తో పట్టుబడినాడు అని పాలకొండ ఎక్సైజ్ సీఐ కె . సూర్య కుమారి తెలియజేశారు.