BREAKING
బ్యాటింగ్‌లో విఫలమైనా మ్యాచ్‌ను గెలిపించింది రోహితే.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రశంసలు! మచ్చలేని మహనీయుడు… మేధావి నాయకుడు… తెలంగాణ కే గర్వకారణ మంత్రి దామోదర్ రాజనర్సింహ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సుధాకర్ రెడ్డి పోలింగ్ కేద్రాల వద్ద, 144,30 పోలీస్ యాక్ట్ ఉంది జాగ్రత్త. డి.ఎస్.పి దైవప్రసాద్ తెలుగుదేశం తోనే అభివృద్ధి సంక్షేమం మహిళల ప్రీమియర్ లీగ్ 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 14 నుంచి గ్రాండ్‌గా టీ20 సమరం! శ్రీవారి హుండీల ఆదాయం రూ. 2 కోట్ల 52 లక్షలు తమిళనాడులో థియేటర్లలో రోజుకు ఆరు ప్రదర్శనలకు అనుమతి.. చిత్ర పరిశ్రమకు పెద్ద దీపావళి కానుక అన్న తిరుప్పూర్ సుబ్రమణియన్! తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన 1వ డివిజన్ నూతన కార్పొరేటర్ కాయం వెంకటరత్నం ఇండో-పసిఫిక్‌లో సరఫరా గొలుసుల పటిష్టతకు రాజ్‌నాథ్ సింగ్ పిలుపు పోలాండ్‌లో 50 కోట్ల డాలర్ల భారీ పెట్టుందుకు షీన్ ప్లాన్ హెల్త్‌కేర్ రంగంలో దూసుకుపోయిన ఇన్సూరెన్స్, ఆసుపత్రి సంస్థల షేర్లు నార్వే రాజ కుటుంబంలో గృహ నిర్బంధంలోనే మేరియస్ బోర్గ్ హోయిబి కొనసాగింపు కార్పొరేట్ దిగ్గజం బీఎండబ్ల్యూకి సవాళ్లు థియేటర్‌లో సాధారణ ప్రేక్షకులతో కలిసి 'జైలర్ 2' సినిమా చూసిన పుదుచ్చేరి సీఎం.. రజినీకాంత్ క్రేజ్ చూసి ఫిదా! గేమింగ్ రంగానికి గీతరావాలా లేక అద్దమా....గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6పై ఆర్థిక విశ్లేషణ

పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం * ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ *

Select Suryaa Now
పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం   * ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ *

పార్వతీపురం, సూర్య : జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. నవంబర్ 5వ తేదీ గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. జిల్లాలో రెండో విడత సాధారణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మొత్తం 15 గ్రామీణ మండలాల్లో 15 జెడ్పీటీసీ, 226 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 6,43,874 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వివరించారు. వీరిలో 3,14,899 మంది పురుషులు, 3,28,910 మంది మహిళలు, 65 మంది ఇతర ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు.

పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని, ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి విధులు, బాధ్యతలపై ఇప్పటికే స్పష్టమైన సూచనలు అందించామని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి పంపిణీ, రవాణా తదితర ఏర్పాట్లను పూర్తి చేసినట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన ఎన్నికల సిబ్బంది
ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. ఆయా కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన ఎన్నికల సామగ్రిని తీసుకొని సంబంధిత పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారని పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సూచించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.